కమల్‌హాసన్‌పై విచారణ వాయిదా
(ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్‌పై నమోదైన ఓ క్రిమినల్ కేసులో విచారణను వచ్చేనెల 9కి వాయిదా వేస్తూ ఢిల్లీలోని ఓ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే స్వతంత్ర భారత ''తొలి ఉగ్రవాది'' అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమిళనాడులో కమల్ హాసన్ ప్రచారం చేస్తూ... ''ఇక్కడ చాలామంది ముస్లింలు ఉన్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్పడం లేదు. మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిలబడి చెబుతున్నా... స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది ఓ హిందువు... అతడి పేరు నాథూరాం గాడ్సే..'' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హిందూ సేన చీఫ్ విష్ణు గుప్త... తమ మనోభావాలు దెబ్బతీస్తూ, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కమల్ హాసన్‌పై కేసు పెట్టారు.