మాస్ మ‌హ‌రాజా ఫ్యాన్స్ కోసం దీవాళి ముందుగానే వ‌స్తుంది

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ స్పీడ్ పెంచాడు. ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, న‌బా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. అయితే దీపావ‌ళి సంద‌ర్భంగా ర‌వితేజ త‌న అభిమానుల‌కి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడు. త‌న 64వ చిత్రాన్ని ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ది తెలియ‌జేయ‌నున్నాడు. మ‌ధ్యాహ్నం 2గం.ల‌కి దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ర‌వితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీ త‌ర్వాత ర‌వితేజ చేసిన చిత్రాల‌న్ని ఫ్లాపులు కాగా, తాజా చిత్రం డిస్కోరాజాపై హోప్స్ పెట్టుకున్నాడు. చూడాలి మ‌రి ఈ చిత్రం అయిన మంచి విజ‌యం ఇస్తుందా లేదా !