బుల్లితెర‌పైనా.. వ‌స్తాద్ అనిపించిన ఇస్మార్ట్ శంక‌ర్

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్‌ శంకర్ చిత్రం జూలై 18న గ్రాండ్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. రామ్‌ లుక్‌, బాడీ లాంగ్వేజ్‌, మేనరిజమ్స్‌ పూరి స్టైల్‌ ఆఫ్ టేకింగ్ సినిమాని ఓ రేంజ్‌లో నిలిపేలా చేసాయి . బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రం సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. ఇటీవ‌ల ద‌స‌రా సంద‌ర్భంగా ఈ చిత్రం బుల్లితెర‌పై ప్ర‌సారం అయింది. 16.63 పాయింట్స్ టీఆర్పీ రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్యప‌ర‌చింది. మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి చిత్రం క‌న్నా 180 శాతం రేటింగ్ ఈ మూవీ రాబ‌ట్ట‌డం విశేషం. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రానికి ఇంత టీఆర్పీ రావ‌డంతో చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేసింది.



పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించారు. పూరీ ఆస్తాన నటుడు సత్యదేవ్‌ మరో కీలకపాత్రలో నటించాడు. మాస్ ఎలిమెంట్స్‌కి సైన్స్ ఫిక్ష‌న్ కాన్సెప్ట్ జోడించి త‌న మార్క్‌తో సినిమా తీసాడు పూరీ. ఈ చిత్రంతో డాషింగ్ డైరెక్ట‌ర్ మ‌రోసారి అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు.